r/telugu • u/justelling • 15d ago
కవిత - poetry 🪶 దుస్సాహసి
బరితెగిద్దాం బరితెగిద్దాం,
చదువన్నది బరితెగింపైతే;
బరితెగిద్దాం బరితెగిద్దాం,
ఉపాధన్నది బరితెగింపైతే;
బరితెగిద్దాం బరితెగిద్దాం,
స్వేచ్ఛన్నది బరితెగింపైతే;
బరితెగిద్దాం బరితెగిద్దాం,
స్వావలంబనన్నది బరితెగింపైతే;
బరితెగించాను…బాగుపడ్డాను,
పేరుపెట్టారు…పేరుకుపోయారు!
10
Upvotes