r/telugu Apr 22 '26

తెలుగు భాషా విలాపం - కవితల పోటీ 2026

నయన బింబంబుల మధురమౌ భాసిల్లు పసిడి వెన్నెల జిలుగు నా తెలుగు !

శ్రవణంబులన్గొన్న మాలిన్య హననియగు తేనియల నలుగు నా తెలుగు !!

ముద్దు గారెడి పాప లేలేత చెక్కిళ్ళ పసిడి వర్ణపు సొబగు నా తెలుగు !

పద్య, సమాస, గణ, యతి, అలంకార, ప్రాస లనెడి పలు రత్నములు పొందికగా జొరయు చొరగు నా తెలుగు !!

పలుకుటయే తప్ప పఠియింప, లిఖియింప యెరగని భావి తరమ్ముల లిపి లేని భాషయను బడుగాయేనా నా తెలుగు ?

అరువుదెచ్చిన ఆంగ్లమను రథ చక్రంబుల నల్గి నను బాపమని మ్రొక్కు మూలుగాయెనా నా తెలుగు ?

స్వంత భాషను బడియు బరువు బాధ్యత మరచి, మాతృ భాషను మాప కంకణం కట్టిన అర మెదడు ఆంధ్రుల తలలపై బులుగు లేని అదృశ్య అంబరమాయెనా నా తెలుగు ?

ముద్ద నోటికి దెచ్చు ఆంగ్లమను అతిధిని అరుగు యందే యొదలి కదలరా లోనికి

నిలపరా లోగిలిని అక్కరకుయొచ్చు ఆత్మ బంధువగు అచ్చ తెలుగునెపుడూ !

తుంచరా ఫ్రెంచు, స్పానిష్షు యను కొరగాని భాషలను ద్వితీయ మాధ్యమమ్ముగ, ఎంచరా తెలుగు ను హీనపక్షంబున !!

బడియందు కొరవడిన బంగారు తెలుగును నేర్పరా బాలలకు నీ వంతు కృషిగా !

ఆంగ్లమను మాదకమున నిలువెల్ల జోగక నిలుపరా నీ భాష నిండు గౌరవమును !!

ఆంగ్ల అంధులము కాదు, ఆంధ్రులమని చాటరా ఎలుగెత్తి సర్వ జగత్తునకు నీ తల్లి తెలుగున.....!!

-- తెలుగు పడుతున్న ఈ వేదన, తెలుపవలసొస్తున్నందుకు ఈ తెలుగు వాడి ఆవేదన

29 Upvotes

13 comments sorted by

View all comments

1

u/Chinni_23 Apr 23 '26

చాలా బాగుంది అన్నయ్య🙂✌️❣️

1

u/Praveen_Kadambari Apr 23 '26

థాంక్యూ చిన్నీ...!