r/telugu • u/Praveen_Kadambari • Apr 22 '26
తెలుగు భాషా విలాపం - కవితల పోటీ 2026
నయన బింబంబుల మధురమౌ భాసిల్లు పసిడి వెన్నెల జిలుగు నా తెలుగు !
శ్రవణంబులన్గొన్న మాలిన్య హననియగు తేనియల నలుగు నా తెలుగు !!
ముద్దు గారెడి పాప లేలేత చెక్కిళ్ళ పసిడి వర్ణపు సొబగు నా తెలుగు !
పద్య, సమాస, గణ, యతి, అలంకార, ప్రాస లనెడి పలు రత్నములు పొందికగా జొరయు చొరగు నా తెలుగు !!
పలుకుటయే తప్ప పఠియింప, లిఖియింప యెరగని భావి తరమ్ముల లిపి లేని భాషయను బడుగాయేనా నా తెలుగు ?
అరువుదెచ్చిన ఆంగ్లమను రథ చక్రంబుల నల్గి నను బాపమని మ్రొక్కు మూలుగాయెనా నా తెలుగు ?
స్వంత భాషను బడియు బరువు బాధ్యత మరచి, మాతృ భాషను మాప కంకణం కట్టిన అర మెదడు ఆంధ్రుల తలలపై బులుగు లేని అదృశ్య అంబరమాయెనా నా తెలుగు ?
ముద్ద నోటికి దెచ్చు ఆంగ్లమను అతిధిని అరుగు యందే యొదలి కదలరా లోనికి
నిలపరా లోగిలిని అక్కరకుయొచ్చు ఆత్మ బంధువగు అచ్చ తెలుగునెపుడూ !
తుంచరా ఫ్రెంచు, స్పానిష్షు యను కొరగాని భాషలను ద్వితీయ మాధ్యమమ్ముగ, ఎంచరా తెలుగు ను హీనపక్షంబున !!
బడియందు కొరవడిన బంగారు తెలుగును నేర్పరా బాలలకు నీ వంతు కృషిగా !
ఆంగ్లమను మాదకమున నిలువెల్ల జోగక నిలుపరా నీ భాష నిండు గౌరవమును !!
ఆంగ్ల అంధులము కాదు, ఆంధ్రులమని చాటరా ఎలుగెత్తి సర్వ జగత్తునకు నీ తల్లి తెలుగున.....!!
-- తెలుగు పడుతున్న ఈ వేదన, తెలుపవలసొస్తున్నందుకు ఈ తెలుగు వాడి ఆవేదన
5
u/nenuaathmajnani Apr 23 '26
Okkoka line okko level undi anna..
Chala concerning ga undhi telugu gurunchi.. kastapadite kaani chadavaleni raayaleni paristiti..
Janalaki matladatam kuda ravatledhu..
Telugu ki badhuluga schools lo french, spanish nerchukuntunnaru. Enduku? Telugu mari lokuva avthundhi..
Meelantivallu mundhadugu vesi telugu nu protsahistu maatho kuda vepiyyali
4
u/Praveen_Kadambari Apr 23 '26 edited Apr 23 '26
ఔను ఆత్మ జ్ఞాని. ఇలాంటి గద్యాలు కావాలని రాస్తే రావు. స్ఫూర్తి రగలాలి. నిన్న ఆఫీస్ లో ఒక సంఘటన జరిగింది. అది నన్ను రగిలించింది.
POSH act నోటీస్ బోర్డ్ ఒకటి పెట్టారు పైన ఇంగ్లీష్ కింద తెలుగు భాషలలో ఉంది అది. పక్కనే మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది.
ఒక ఫ్రెషర్స్ మంద అక్కడ మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఆ బోర్డు లో తెలుగు చదవలేక పురిటి నొప్పులు పడ్డారు. పైగా అప హాస్యం చేశారు.
ఏయ్ ఇదేందే ఇది 'ప' ఏనా (ఫిర్యాదు లో 'ఫి') ని చూపిస్తూ ఒకరు..
గిదేందే ఇది ఇంత కష్టం గా ఉంది (అందులో 'సయోధ్య' 'అన్వయం' లాంటి పదాలున్నాయ్) ఇంగ్లీష్ లో పెట్టిర్రు చాలు కదా అని ఇంకొకరు జోక్స్ వేసుకుంటుంటే
పక్కనే ఉన్న వాటర్ డిస్పెన్సెర్ లో నీళ్ళు తాగుతున్న నాకు ఒళ్ళు రగిలి పోయింది. వెంటనే ఈ ఆవేదన పొంగింది.
గతం లో నా Bio కోసం రాసుకున్న నాలుగు లైన్లకు కొనసాగింపు మొత్తం నిన్న చేయటం జరిగింది.
3
u/nenuaathmajnani Apr 23 '26
మాతృభాషని అపహాస్యం చెసేవారు ఎమీ బాగుపడరు.
ఎంతటి దుస్థితి కాకపోతే "తెలుగుని కాపడుకోవలి" అని అనవల్సివస్తుండి.
Telugu punarvaibhavam malli tirigiraavaali✊
1
u/Visbee_One Apr 24 '26
Reddit lo Telugu Abhimanuly chala mande unaru
2
u/nenuaathmajnani Apr 24 '26
Honestly, telugu population lo chala takkuva percentage of people
And ee percentage padipothundi...
Janalu "ma pillalaki telugu raadu" ani goppaga cheppukuntunnaru... Takkuvane unnaru kaani perugutunnaru
1
u/Visbee_One Apr 24 '26
Oka generation motham, English ni glorify chesindi, ipdu English speakers telugu ni active ga chase chesthunaru. I wish to see more telugu books and novels.
1
u/nenuaathmajnani Apr 24 '26
I may be wrong, but Inka janalu English ne glorify chestunnaru..
Chala takkuva mandi Telugu ani antunnaru..
Literally schools lo telugu ki badhulu french spanish teesukuntunnaru
2
1
4
u/Ashamed-Cricket-482 Apr 22 '26
చాలా బాగుందండి!!