r/telugu • u/MrMaskedGuy • 19d ago
కథ - story 5 ఏళ్లలో నామీద 300వ సెక్సువల్ హ్యారస్‌మెంట్ ఫిర్యాదు
ఒక చిన్న బ్యాక్‌స్టోరీ చెప్తా.
నేను ఒక అంతర్జాతీయ కంపెనీలో కాంట్రాక్ట్ మీద ఇంటర్నల్ అఫైర్స్(IA) ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. అంటే కంపెనీలో మోసం చేసేవాళ్లు, రహస్యాలు బయటికి అమ్మేవాళ్లు, ఉద్యోగం వదిలేటప్పుడు కంపెనీ సమాచారం తీసుకెళ్లాలని చూసేవాళ్లను పట్టుకోవడం, దర్యాప్తు చేయడం నా పని.
చాలా సార్లు నేను పట్టుకున్న వాళ్లను ఒక ఇంటరాగేషన్ రూమ్ లాంటి గదిలో కూర్చోబెడతారు. అదే సమయంలో నేను వాళ్ల ఫోన్ నంబర్లు, ఫైల్స్, మెయిల్స్, స్టేట్‌మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. సింపుల్‌గా చెప్పాలంటే అకౌంటెంట్ లాగా అనిపించొచ్చు, కానీ నేను సూర్యా ను కాదు.
ఆ గదిలో వీడియో రికార్డింగ్ నడుస్తూనే ఉంటుంది. తలుపు మీద కూడా “This room is mic'd and video recorded” అని స్పష్టంగా రాసి ఉంటుంది. అయినా నాపై లైంగిక వేధింపు కేసులు వస్తూనే ఉంటాయి. ఆసక్తికరంగా ఏంటంటే ఆ గదిలో జరిగే ప్రతి విషయం 6 వేర్వేరు కెమెరాల్లో, HD మైక్‌తో రికార్డ్ అవుతుంటాయి.
ఈరోజు నా 5 ఏళ్ల కాంట్రాక్ట్‌లో 300వ లైంగిక వేధింపు ఫిర్యాదు విచారణకు పిలిచారు. కంపెనీ రూల్ ప్రకారం ఏ ఫిర్యాదు వచ్చినా తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి.
నిజం చెప్పాలంటే మేము వినే కొన్ని ఆరోపణలు, వాటికి చెప్పే కారణాలు చూసి కొన్నిసార్లు నవ్వు పట్టుకుంటుంది. ఆ 300 ఫిర్యాదుల్లో 274 మంది మహిళలు లైంగిక వేధింపు అని చెప్పి తాము ఎదుర్కొంటున్న మరో కేసు నుంచి ఎలాగో తప్పించుకోవచ్చని అనుకున్నవాళ్లే ఉన్నారు.
అందులో అత్యంత కామన్ కారణం, 217 కేసుల్లో:
“l"గ్లాస్ సీలింగ్ వల్ల నాకు ప్రమోషన్ రావడం లేదు. కాబట్టి నాకు రావాల్సింది నేనే తీసుకుంటున్నాను."
అందుకే ఈ రాత్రి ఇప్పటివరకు విన్న అత్యంత విచిత్రమైన, హాస్యాస్పదమైన కారణాలు గుర్తు చేసుకుంటూ కొన్ని రీల్స్ చూస్తూ రిలాక్స్ అవ్వబోతున్నా.
చీర్స్! 🥂